Joe Root: లార్డ్స్ మైదానంలో మాటల యుద్ధంపై ఇంగ్లండ్ సారథి జో రూట్ వివరణ

England captain Joe Root explains verbal exchange between two teams

  • లార్డ్స్ టెస్టులో భారత్ గెలుపు
  • తీవ్ర గొడవలేమీ జరగలేదని వెల్లడి
  • విద్వేషం చోటుచేసుకోలేదని స్పష్టీకరణ
  • షమీ, బుమ్రాలపై ప్రశంసలు

లార్డ్స్ టెస్టులో టీమిండియా అద్భుత విజయం అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడంపై స్పందించాడు. కోహ్లీ సేన దూకుడు ప్రదర్శించడంలో తనకు తప్పేమీ కనిపించలేదని పేర్కొన్నాడు. కోహ్లీ సహజంగానే దూకుడు స్వభావి అని, అతడితో పోల్చితే తాను భిన్నమైన వ్యక్తినని తెలిపాడు. మొత్తమ్మీద టీమిండియా నిజాయతీని శంకించాల్సిన పరిస్థితులేవీ లేవని రూట్ స్పష్టం చేశాడు.

ఈ టెస్టు సందర్భంగా ఆటగాళ్ల మధ్య మరీ తీవ్రమైన గొడవలేమీ జరగలేదని, విద్వేషం ఎక్కడా చోటు చేసుకోలేదని వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్రణాళికతో ఆడగా, తాము వ్యూహాత్మకంగా అనేక తప్పులు చేశామని రూట్ అంగీకరించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో షమీ, బుమ్రా పట్టుదలతో బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ లో కీలక అంశమని పేర్కొన్నాడు.

వాస్తవానికి టీమిండియా లోయరార్డర్ ను త్వరితగతిన పెవిలియన్ చేర్చగలమని భావించానని, కానీ షమీ, బుమ్రా తమను ఆశ్చర్యానికి గురిచేశారని రూట్ వివరించాడు. వారిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం కారణంగానే తమ జట్టు కష్టాల్లో పడిందని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News