Prakash Raj: మళ్లీ షూటింగు మొదలెట్టిన ప్రకాశ్ రాజ్

Prakash Raj starts work after recovered from injury
  • ఇటీవల ఓ షూటింగ్ లో గాయపడ్డ ప్రకాశ్ రాజ్
  • ప్రకాశ్ రాజ్ కు చిన్నపాటి శస్త్రచికిత్స
  • మణిరత్నం, కార్తీలతో కలిసి మధ్యప్రదేశ్ కు వెళ్లిన ప్రకాశ్ రాజ్
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చిన్నపాటి సర్జరీని నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. మళ్లీ సినిమా షూటింగులను ప్రారంభించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. మణిరత్నం సార్, కార్తీలతో కలిసి గ్వాలియర్ లో ల్యాండ్ అయ్యామని చెప్పారు. గ్వాలియర్ ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోను షేర్ చేశారు.

మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం మధ్యప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ కోసం ఓర్చాకు వెళ్తున్నామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ బ్యానర్ల కింద అల్లిరాజా సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Prakash Raj
Tollywood
Shooting

More Telugu News