Jagan: జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

CBI ED court issues summons to Jagan

  • వాన్ పిక్ కేసులో సమన్లు జారీ
  • సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • విజయసాయి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్ లకు కూడా సమన్లు

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం సంభవించింది. ఏపీ సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. వాన్ పిక్ ఈడీ కేసులను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణలకు కూడా సమన్లు జారీ చేసింది. పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్ టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం శామ్యూల్, మన్మోహన్ సింగ్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News