Rahul Ramakrishna: 'నెట్' సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్!

Intresting teaser from NET move
  • రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారిగా 'నెట్'
  • కీలకమైన పాత్రలో అవికా గోర్ 
  • దర్శకుడిగా భార్గవ్ మాచర్ల పరిచయం 
  • సెప్టెంబర్ 10 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ 
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పు వచ్చింది. ఎంత బడ్జెట్ తో సినిమా తీశారు అనేదానికంటే, ఎంత ఆసక్తికరంగా తీశారు అనే విషయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకులు .. విభిన్నమైన కాన్సెప్టులతో తమ సత్తా చాటుకుంటున్నారు.

ఈ తరహా సినిమాలు ఓటీటీ ద్వారా ఎక్కువగా వస్తున్నాయి .. అంతగానూ ఆదరణ పొందుతున్నాయి. అలా రూపొందిన సినిమానే 'నెట్'. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. లక్ష్మణ్ .. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు చెక్ చేసే పని చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక వీడియో ఆయన కంటపడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఫలితంగా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటాడు? అనేదే కథ.    

టీజర్ చూస్తుంటేనే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. రాహుల్ రామకృష్ణ తన పాత్రలో జీవించాడనే విషయం అర్థమవుతోంది. అవికా గోర్ .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించాడు. నరేశ్ కుమ్రన్ సంగీతాన్ని అందించాడు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 'జీ 5'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Rahul Ramakrishna
Avika
Bhargav

More Telugu News