Para Olympics: టోక్యో పారా ఒలింపిక్స్ లో కరోనా కలకలం
- ఇటీవలే విజయవంతంగా ముగిసిన ఒలింపిక్స్
- ఈ నెల 24న ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్
- పారా ఒలింపిక్ విలేజ్ లో తొలి పాజిటివ్ కేసు నమోదు
ప్రపంచంలో జరిగే అతిపెద్ద క్రీడా వేడుక ఒలింపిక్స్. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ ప్రపంచంలోని క్రీడాభిమానులందరినీ అలరిస్తాయి. ఒలింపిక్స్ జరిగే దేశానికి ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు తరలి వెళ్తుంటారు. అయితే, కరోనా నేపథ్యంలో... చరిత్రలో తొలిసారి అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియంలతో టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. అయితే ఒలింపిక్స్ సందర్భంగా కొందరు క్రీడాకారులు కరోనా బారిన పడి అక్కడి నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఒలింపిక్స్ విజయవంతంగా ముగిశాయి.
ఇప్పుడు టోక్యో పారా ఒలింపిక్స్ కు సర్వం సిద్ధమైంది. ఈనెల 24న పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 5న ఈ క్రీడలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు ఇప్పటికే అక్కడకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో పారా ఒలింపిక్ గ్రామంలో ఒక కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపింది.