Gorantla Butchaiah Chowdary: టీడీపీకి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి రాజీనామా?

TDP MLA Gorantla Butchaiah Chowdary to resign
  • టీడీపీ హైకమాండ్ పై గోరంట్ల తీవ్ర అసంతృప్తి
  • పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదనే ఆవేదన 
  • రెండు, మూడు రోజుల్లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు వైసీపీ కండువాలను కప్పుకోనప్పటికీ... జగన్ సమక్షంలో వారి కుటుంబీకులను వైసీపీలో చేర్చి, ఆ పార్టీకి మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. ఈ షాకుల నుంచి టీడీపీ ఇంకా కోలుకోకమందే... ఆ పార్టీకి మరో పెద్ద షాక్ తగలబోతోందని తెలుస్తోంది.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారని విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల మరో రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం లేదని గోరంట్ల అసంతృప్తికి గురైనట్టు సమాచారం. తనలాంటి సీనియర్ ను కూడా హైకమాండ్ సరిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు.

పార్టీ శ్రేణులు బుజ్జగిస్తే ఆయన వెనక్కి తగ్గుతారా? అనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు టీడీపీ నుంచి బయటకు  వస్తే... బీజేపీలో చేరుతారా? లేక వైసీపీ గూటికి చేరుకుంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. గత మూడు, నాలుగు నెలల నుంచి వైసీపీపై కానీ, సీఎం జగన్ పైన కానీ ఆయన ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

మరోవైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. స్థానికంగా ఎమైనా ఇబ్బందులు ఉంటే తనకు చెప్పాలని సూచించారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Resign
YSRCP

More Telugu News