kabul: ఆఫ్ఘనిస్థాన్‌లో బయటకు వస్తోన్న ప్రజలు.. మళ్లీ కళకళలాడుతోన్న మార్కెట్లు.. ఐస్‌క్రీములు తిన్న తాలిబన్లు
- ఆఫ్ఘన్‌లో సాధారణ పరిస్థితులు?
- క్రమంగా తెరుచుకుంటోన్న దుకాణాలు
- రోడ్లపై మళ్లీ రద్దీ
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతుండడంతో ఇటీవల మార్కెట్లు నిర్మానుష్యంగా మారిన విషయం తెలిసిందే. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఎలా పాలిస్తారనే ఆందోళన ప్రజల్లో కనపడింది. అయితే, క్రమంగా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడి మార్కెట్లు మునుపటిలాగే కళకళలాడుతున్నాయి.
మార్కెట్లలోకి జనాలు వస్తున్నారు.. రోడ్లపై మళ్లీ రద్దీ పెరిగింది. ప్రజలు మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్తున్నారు. కాబుల్‌లోని బర్డ్ స్ట్రీట్‌లో చాలా మంది కనపడ్డారు. ఓ ప్రాంతంలోని దుకాణంలో తాలిబన్ ఉగ్రవాదులు ఐస్‌క్రీమ్ లు తింటూ కనిపించారు.