Nimmakayala Chinarajappa: బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లిన చినరాజప్ప, జవహర్

Chinarajappa and Jawahar goes to Gorantla house
  • టీడీపీలో గోరంట్ల కలకలం
  • పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు
  • అప్రమత్తమైన టీడీపీ హైకమాండ్
  • గోరంట్ల వద్దకు నేతలతో రాయబారం
టీడీపీలో ఊహించని సంక్షోభం నెలకొంది. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడుతున్నారంటూ వార్తలు రావడంతో టీడీపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో గోరంట్లతో మాట్లాడారు. తాజాగా పార్టీ నేతలు చినరాజప్ప, జవహర్ రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లారు. ఆయనతో వారిరువురు చర్చలు జరిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మనోభావాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. గోరంట్ల ప్రస్తావించిన అంశాలను చంద్రబాబుకు నివేదిస్తామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో తనకు కొన్ని సమస్యలు ఉన్నట్టు గోరంట్ల చెప్పారని, తనను కొందరు గౌరవించడంలేదని చెప్పారని చినరాజప్ప వెల్లడించారు. రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా గోరంట్లకు పార్టీలో ఎప్పుడూ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.
Nimmakayala Chinarajappa
Jawahar
Gorantla Butchaiah Chowdary
TDP
Andhra Pradesh

More Telugu News