Andhra Pradesh: మాకు 70 శాతం , తెలంగాణకు 30 శాతం జలాలు పంచండి: కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

AP write letter to krishna river board on water distribution

  • సాగర్, పులిచింతల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లోనూ వాటా కావాలని కోరిన ఏపీ
  • ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చే వరకు 70:30 నిష్పత్తిలో నీటిని పంచాలని కోరిన వైనం
  • 50:50 నిష్పత్తిలో పంచాలంటున్న తెలంగాణ

కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చే వరకు ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లోని నీటిని పంచాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తమకు 70 శాతం, తెలంగాణకు 30 శాతం నీటిని పంచాలని అందులో కోరింది. తీర్పు వచ్చే వరకు ఇదే నిష్ఫత్తిని కొనసాగించాలని ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

అలాగే, నాగార్జున సాగర్ ఎడమ విద్యుత్ కేంద్రం, పులిచింతలలో ఉత్పత్తి చేసే విద్యుత్‌లోనూ తమకు వాటా ఇవ్వాలన్నారు. మరోవైపు, గతేడాది 66:34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకున్నామని, ఈసారి దానిని 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ఇప్పటికే కృష్ణా బోర్డును కోరడం, ఈ నెల 27న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చిన  నేపథ్యంలో ఏపీ తాజాగా లేఖ రాయం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News