Aadhar Card: పోస్టుమ్యాన్‌కు ఫోన్ చెయ్యండి.. ఇంటి వద్దే ఆధార్‌తో ఫోన్ నంబరును అనుసంధానించుకోండి: తపాలాశాఖ

Aadhar and mobile number linking at your door step
  • ఇంటి వద్దకే సేవలను విస్తరించిన తపాలా శాఖ
  • రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది 
  • ఈ సేవలు ఫోన్ నంబరును అనుసంధానించేందుకు మాత్రమే
ఆధార్‌కార్డుకు ఫోన్ నంబరు అనుసంధానించడానికి ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పోస్టుమ్యాన్‌కు కానీ, పోస్టుమాస్టర్‌కు కానీ ఒక్క ఫోన్ చేస్తే నేరుగా ఇంటికి వచ్చి, ఆ పనిచేసి పెడతారు. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా లేదు. రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు పోస్టల్ శాఖ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు.

ఇప్పటి వరకు ఈ సేవలను పోస్టల్ కార్యాలయాల్లో మాత్రమే అందించామని, ఇప్పుడు ఈ సేవలను ఇళ్ల వరకు విస్తరించామని పేర్కొన్నారు. మొత్తం 534 మంది పోస్టుమ్యాన్‌లు, 4156 మంది బ్రాంచి పోస్ట్‌మాస్టర్ల ద్వారా ఈ సేవలను అందించనున్నట్టు తెలిపారు. పోస్టుమ్యాన్ వద్ద ఉండే ఫోన్‌లోని ప్రత్యేక యాప్ సాయంతో ఈ సేవలు అందించనున్నట్టు వివరించారు.

ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు 14,675 మందికి ఈ సేవలు అందించినట్టు తెలిపారు. అయితే, ఆధార్‌ కోసం దరఖాస్తు, చిరునామా మార్పు, పుట్టిన రోజు తేదీల్లో తప్పులు వంటి వాటిని సరిదిద్దేందుకు మాత్రం పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
Aadhar Card
Hyderabad
Phone Number
Postal Department

More Telugu News