Joe Biden: ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుంది: ఆఫ్ఘ‌న్ నుంచి పౌరుల త‌ర‌లింపుపై జో బైడెన్

biden on afghan situation

  • ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అమెరికా పౌరుల భద్రతే మా లక్ష్యం
  • వారిని విమానాల్లో త‌ర‌లించ‌డం క్లిష్టమైన ప్రక్రియ
  • కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా బలగాలతో భ‌ద్ర‌త‌ కట్టుదిట్టం

ఆఫ్ఘ‌నిస్థాన్ ను తాలిబ‌న్లు ఆక్రమించి రెచ్చిపోతోన్న అంశంపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌రోసారి స్పందించారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అమెరికా పౌరుల భద్రతే తమ లక్ష్యమని తెలిపారు. ఆ దేశం నుంచి వారిని విమానాల్లో త‌ర‌లించ‌డం క్లిష్టమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుందని చెప్పారు.

ఆ దేశంలో అమెరికా బలగాలు క‌ఠిన పరిస్థితుల మ‌ధ్య‌ పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్ప‌టికీ ఆఫ్ఘన్‌లోని కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఉందని, మొత్తం 4 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఆర్మీకి చెందిన‌ విమానాలు మాత్రమే కాకుండా ఛార్టర్ విమానాలు కూడా అక్క‌డ ఉన్నాయ‌ని తెలిపారు. ఆఫ్ఘ‌న్ నుంచి పౌరులను తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. అమెరికా పౌరులంద‌రినీ అక్క‌డి నుంచి క్షేమంగా తీసుకొస్తామని తెలిపారు.

కాబుల్‌లో కనిపిస్తున్న దృశ్యాలు విచార‌క‌ర‌మ‌ని చెప్పారు. ఆ విమానాశ్రయం వ‌ద్ద‌ ఉన్న‌ వారంద‌రినీ ఎప్పటిలోగా విదేశాల‌కు త‌ర‌లిస్తామ‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. కాగా, ఆఫ్ఘ‌న్‌లో అమెరికా బలగాలకు సహకరించిన వారంద‌రినీ తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అగ్ర‌రాజ్యం భావిస్తోంది.  

  • Loading...

More Telugu News