Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ ఇంటి వద్ద భారీ కటౌట్

Huge cutout at Mohammed Sirajs house
  • ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న పేసర్
  • వికెట్ తీసిన ప్రతిసారీ నోటిపై వేలు ఉంచడం సిరాజ్ అలవాటు
  • అదే ఫోజుతో భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. లార్డ్స్ మైదానంలో అద్భుత విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై టీమిండియా విజయకేతనం ఎగరేసింది. ఈ విజయంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 8 వికెట్లు తీశాడీ పేసర్. దీంతో టెస్టు సిరీసులో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో సిరాజ్ అభిమానులు.. అతని ఇంటి వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వికెట్ తీసిన ప్రతిసారీ నోటిపై వేలు ఉంచి సెలబ్రేట్ చేసుకోవడం సిరాజ్ అలవాటు.

దీనిపై మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన ఈ పేసర్.. తను అలా నోటిపై వేలు ఉంచేది అవుటైన బ్యాట్స్‌మెన్‌ను ఉద్దేశించి కాదని, తన సత్తాను విమర్శించే వారిని ఉద్దేశించని వివరించాడు. తన సత్తాపై అనుమానాలు వ్యక్తం చేసిన వారికి, విమర్శలు చేసే వారికి తన ప్రదర్శనే సమాధానమని సిరాజ్ వెల్లడించాడు.  ఇప్పుడు ఇదే ఫోజుతో సిరాజ్ అభిమానులు అతని ఇంటి వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, రెండో టెస్టులో విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా తాజాగా లీడ్స్ చేరుకుంది. ఆగస్టు 25 నుంచి మొదలయ్యే మూడో టెస్టు కోసం సిద్ధమవుతోంది.


Mohammed Siraj

More Telugu News