Shiv Sena: గాంధీని కాకుండా జిన్నాను హత్య చేసి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: శివసేన

Sanjay Raut comments on Gandhis murder

  • జిన్నాను హత్య చేసి ఉంటే విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు అవసరం ఉండేది కాదు
  • మన దేశ విభజన గాయం ఎలా మానుతుంది?
  • అఖండ హిందుస్థాన్ సాధ్యమయ్యేలా లేదు

ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులను భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చుతూ శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక గొప్ప దేశ ఉనికి, సార్వభౌమత్వ విధ్వంసం బాధిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ విభజననాటి పరిస్థితుల గురించి తన అధికార పత్రిక 'సామ్నా'లో ప్రచురించిన కథనంలో ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ ఎడిటోరియల్ ను శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ రాశారు. ఆనాడు మహాత్మాగాంధీని కాకుండా మహమ్మద్ అలీ జిన్నాను నాథూరాం గాడ్సే హత్య చేసి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదని అన్నారు. అదే జరిగి ఉంటే దేశ విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు అవసరం ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

ఒక దేశ సార్వభౌమాధికారం, అస్తిత్వం విధ్వంసాల తాలూకు బాధ ఎలా ఉంటుందో ప్రస్తుత ఆప్ఘనిస్థాన్ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయిని సంజయ్ రౌత్ తన ఎడిటోరియల్ లో పేర్కొన్నారు. మన దేశం విషయానికి వస్తే... విభజన గాయం ఎలా మానుతుందని ప్రశ్నించారు. విడిపోయిన ముక్కను కలుపుకోకపోతే విభజన గాయం నుంచి ఉపశమనం లభించదని అన్నారు. అఖండ హిందుస్థాన్ ఏర్పడాలని మనం కోరుకుంటున్నప్పటికీ... అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు. ప్రధాని మోదీ అఖండ హిందుస్థాన్ ను కోరుకుంటే శివసేన స్వాగతిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News