Blue Moon: నేడు ఆకాశంలో బ్లూ మూన్ దర్శనం!

Blue Moon will happen in the sky today

  • ప్రతి 2.7 ఏళ్లకు ఓసారి బ్లూ మూన్ దర్శనం
  • భారత్ లో అర్ధరాత్రి కనువిందు చేయనున్న నీలి చంద్రుడు
  • తదుపరి బ్లూ మూన్ 2024లో దర్శనం
  • తొలిసారిగా 1528లో బ్లూ మూన్ గుర్తింపు

ఇవాళ రాత్రి ఆకాశంలో జాబిల్లి విభిన్నంగా కనిపించనుంది. చంద్రుడు నేడు నీలి వర్ణంలో దర్శనమివ్వనున్నాడు. భారత్ లో ఇది అర్ధరాత్రి 12 గంటల సమయంలో కనువిందు చేయనుంది. ఈ మేరకు అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ వెల్లడించింది.

ఈ అరుదైన బ్లూ మూన్ సగటున 2.7 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తుందని స్కై అండ్ టెలిస్కోప్ మ్యాగజైన్ తెలిపింది. తదుపరి నీలి వర్ణ చంద్రుడ్ని చూడాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుంది. కాగా తొలి బ్లూ మూన్ ను 1528లో గుర్తించారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

  • Loading...

More Telugu News