Producers Guild: సినిమా థియేటర్ల సంఘంపై తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం

Telugu Producers Guild fires on Cinema Theaters Association and Exhibitors

  • ఎగ్జిబిటర్ల తీరుపైనా అసంతృప్తి
  • వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవు
  • సినిమాపై సర్వాధికారం నిర్మాతలదేనని వెల్లడి
  • పరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని పిలుపు

సినిమా థియేటర్ల సంఘం, ఎగ్జిబిటర్లపై తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. ఓ సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే వుంటాయని గిల్డ్ స్పష్టం చేసింది. తన సినిమాను ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలన్నది నిర్మాత ఇష్టంపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

తెలంగాణ ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించింది. చిన్న సినిమాలు, నిర్మాతలను తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టించుకోవడంలేదని నిర్మాతల గిల్డ్ పేర్కొంది. కలసికట్టుగా పనిచేసి పరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News