Amit Shah: అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించండి: కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం

Gaddar requests Kishan Reddy for Amith Shah appointment

  • తనపై ఉన్న కేసుల గురించి చర్చించిన గద్దర్
  • అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని విన్నపం
  • కేసుల ఎత్తివేత గురించి గతంలో కేసీఆర్ కు విన్నవించిన గద్దర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్ కలిశారు. దేశ వ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి ఆయనతో చర్చించారు. ఈ కేసులను ఎత్తేయాలని, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించేందుకు ఆయన అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఆయన తన యాత్రను ముగించారు.

తనపై కేసులను ఎత్తేయడానికి, న్యాయ సహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని గతంలో గద్దర్ కోరారు. ప్రభుత్వ పిలుపు మేరకు 1990లో నక్సలిజాన్ని వదిలిపెట్టి, తాను జనజీవన స్రవంతిలో కలిశానని చెప్పారు. 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. తన వెన్నుపూస వద్ద బుల్లెట్ ఇప్పటికీ ఉందని చెప్పారు. ఆ బుల్లెట్ వల్ల తనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని, అప్పటి నుంచి తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపారు. తాను పరారీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు.

  • Loading...

More Telugu News