Road Accident: మిర్యాలగూడలో ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి మృతి

Travels bus collide to lorry three dead in miryalaguda
  • ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు
  • మృతుల్లో ఇద్దరు ప్రకాశం జిల్లా, ఒకరు గుంటూరు జిల్లా వాసులు 
  • మరో 15 మందికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఈ తెల్లవారుజామున ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జున్ (40), నాగేశ్వరరావు (44), గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్ (42)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
Miryalaguda
Ongole
Prakasam District
Guntur District

More Telugu News