Rape Case: అత్యాచార బాధితురాలు, అత్యాచార నిందితుడిని 'దేశ భవిష్యత్ సంపద'గా అభివర్ణించిన న్యాయమూర్తి!
- మద్యం తాగించి అత్యాచారం చేశాడని యువతి ఆరోపణ
- బెయిలు విచారణ సందర్భంగా జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు
- బెయిలు మంజూరు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని, అత్యాచార బాధితురాలిని ప్రతిభావంతులుగా, ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించిన గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించి, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘బాధితురాలు, నిందితుడు ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు ప్రతిభావంతులనీ, ‘దేశ భవిష్యత్ సంపద’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు.