Justin Trudeau: తాలిబన్లు ఉగ్రవాదులు.. ఆంక్షలు విధించాల్సిందే: కెనడా ప్రధాని ట్రూడో

Will talk about sanctions on Talibans says Justin Trudeau

  • తొలి నుంచి తాలిబన్లను టెర్రరిస్టులుగానే చూస్తున్నాం
  • టెర్రరిస్టుల జాబితాలో తాలిబన్లు ఉన్నారు
  • జీ7 సమావేశంలో ఆంక్షలపై చర్చిస్తాం

ఆఫ్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. చైనా, పాకిస్థాన్ లు ఇప్పటికే తాలిబన్లకు మద్దతుగా స్పందించాయి. ఈ అంశంపై భారత్ ఇంకా స్పందించలేదు. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... వారిని ఉగ్రవాదులుగానే గుర్తించాలని ఆయన చెప్పారు. తొలి నుంచి తాలిబన్లను కెనడా టెర్రరిస్టులుగానే చూస్తోందని అన్నారు. టెర్రరిస్టుల జాబితాలో తాలిబన్లు ఉన్నారని చెప్పారు. తాలిబన్ల పాలనపై ఆంక్షల విధింపుపై తాము చర్చిస్తామని తెలిపారు.

ఈరోజు జీ7 దేశాధినేతలు వర్చువల్ గా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో వీరు ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న పరిణామాలపై చర్చించనున్నారు. జీ7 గ్రూపులో కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు ఉన్నాయి. ఈ సమావేశంలో తాలిబన్లపై ఆంక్షలు విధించే అంశంపై తాము చర్చిస్తామని చెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహిస్తోంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తాలిబన్ల వ్యవహారశైలిని బట్టి ఆంక్షలను విధించడంపై ఆలోచిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News