China: ప్రమాద‌కర డెల్టా వేరియంట్‌ను స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేసిన చైనా!

NO new Delta cases in China

  • కొన్ని రోజులుగా చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి
  • కొన్ని రోజుల్లో 31 ప్రావిన్సుల్లో 1200 కేసులు
  • క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టిన చైనా
  • నిన్న ఒక్క కేసు కూడా న‌మోదు కాని వైనం

ప్రపంచాన్ని చుట్టేస్తూ డెల్టా వేరియంట్ రూపంలో క‌రోనా మ‌రోసారి విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. దాని విజృంభ‌ణ‌కు ఎన్నో దేశాలు మ‌రోసారి క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. అయితే, ఈ వేరియంట్ చైనాకూ వ్యాపించ‌గా డ్రాగన్ దేశం దీనికి కూడా అడ్డుక‌ట్ట వేస్తోంది. స‌మ‌ర్థంగా చ‌ర్య‌లు తీసుకుంటూ ఎక్క‌డిక‌క్క‌డ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేస్తోంది.

కొన్ని రోజులుగా డెల్టా వేరియంట్ చైనాలో వ్యాపిస్తుండ‌గా ఆ దేశంలోనూ వైర‌స్ ఉద్ధృతి త‌ప్ప‌దని భావిస్తుండ‌గా, చైనా మాత్రం దాన్ని కూడా క‌ట్ట‌డి చేసింది. దీంతో నిన్న ఒక్క‌ పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ  ఏడాది జులై త‌ర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాక‌పోవ‌డం ఇదే తొలిసారి. చైనాలోని నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది.

కాగా, కొన్ని రోజుల క్రితం  నాన్‌జింగ్ న‌గ‌రంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో తొలి డెల్టా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. అనంత‌రం వెంట‌నే 31 ప్రావిన్సుల్లో 1200 కేసులు న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో  క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డంతో చైనా ఆ వైర‌స్‌ను స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. పెద్ద ఎత్తున క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది.

  • Loading...

More Telugu News