Telangana: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు: సీఎస్ సోమేశ్ కుమార్

No chance for Corona third wave in Telangana says CS Somesh Kumar
  • ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
  • హైదరాబాదులో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాం
  • వ్యాక్సిన్ వేయించుకోవడంలో అలసత్వం వద్దు
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఒకవేళ వచ్చినా ఎలాంటి పరిస్థితినైనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 27 వేల బెడ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో ఏడు వేల పడకలను సిద్ధం చేస్తామని చెప్పారు.

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే క్రమంలోనే హైదరాబాదులో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. హైదరాబాదులో తప్ప మన దేశంలోని మరే నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేదని చెప్పారు. 15 రోజుల్లో 100 శాతం మందికి కనీసం తొలి డోసు వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు.
Telangana
Corona Virus
Third Wave
Chief Secretary
Somesh Kumar

More Telugu News