Paralympics: మరోసారి క్రీడా సంరంభం... టోక్యోలో ప్రారంభమైన పారాలింపిక్స్

Paralympics starts in Tokyo

  • సెప్టెంబరు 5వరకు పారాలింపిక్స్
  • పాల్గొంటున్న 163 దేశాల అథ్లెట్లు
  • 22 క్రీడాంశాల్లో 540 ఈవెంట్లు
  • 54 మందితో బరిలో దిగుతున్న భారత్

ఇటీవల జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్ క్రీడలు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ యావత్ ప్రపంచాన్ని అలరించాయి. తాజాగా అదే టోక్యోలో మరో క్రీడా సంరంభం షురూ అయింది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్ క్రీడలు ఈ సాయంత్రం ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత బృందం కూడా పాల్గొంది. దివ్యాంగ అథ్లెట్ టేక్ చంద్ వీల్ చైర్ లో కూర్చుని త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందానికి ఈ మార్చ్ పాస్ట్ లో నేతృత్వం వహించాడు.

నేటి నుంచి సెప్టెంబరు 5 వరకు జరిగే టోక్యో పారాలింపిక్స్ లో 163 దేశాల నుంచి 4,500 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. మొత్తం 22 క్రీడాంశాలకు చెందిన 540 ఈవెంట్లు నిర్వహించనున్నారు. భారత్ నుంచి 54 మంది బరిలో దిగుతున్నారు. గత పారాలింపిక్స్ లో రెండు స్వర్ణాల సహా భారత్ 4 పతకాలు గెలిచింది. ఈసారి భారత అథ్లెట్లు 9 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.

  • Loading...

More Telugu News