Mopidevi Venkataramana: చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణ రాజు కీలుబొమ్మగా మారారు: మోపిదేవి విమర్శలు

Raghu Raju became as puppet of Chandra Babu says Mopidevi
  • వైఎస్  జగన్ బొమ్మతో రఘురాజు గెలిచారు 
  • నైతిక విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు
  • మీడియా ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మతో గెలిచిన రఘురాజు... నైతిక విలువలు కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారని దుయ్యబట్టారు.

ప్రజాభిమానాన్ని కోల్పోతున్న ఆయన... మీడియా ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. రఘురామకృష్ణరాజు ప్రతి రోజు వైసీపీపై, ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కూడా సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్లు వేశారు. వచ్చే నెల 15న ఈ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది.
Mopidevi Venkataramana
Jagan
YSRCP
Raghu Rama Krishna Raju
Chandrababu
Telugudesam

More Telugu News