Kethireddy: కొందరు వలంటీర్లలో అవినీతి పెచ్చుమీరింది: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

YCP MLA Kethireddy severe comments on volunteers

  • ధర్మవరం నియోజకవర్గంలో అవినీతి కలకలం
  • 267 మంది వలంటీర్ల తొలగింపు
  • 10 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి మెమోలు
  • జగన్ ఆశయాన్ని వమ్ము చేస్తున్నారన్న కేతిరెడ్డి

ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే, కొందరు వలంటీర్లు సీఎం జగన్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని అన్నారు.

ధర్మవరం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన 267 మంది వలంటీర్లను తొలగించామని వెల్లడించారు. కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు బయటికి రాని సమయంలో వీరు ఇదే అదనుగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.

గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి మెమోలు ఇచ్చినట్టు తెలిపారు. వలంటీర్లు పథకాల అమలులో డబ్బు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News