India: దేశం కొవిడ్ సెకండ్ వేవ్ మధ్యలో ఉంది: కేంద్రం

Union Govt tells country is in mid corona second wave

  • కరోనా పరిస్థితులపై కేంద్రం స్పందన
  • 60 శాతం కేసులు కేరళలోనే ఉన్నాయని వెల్లడి
  • ఇతర రాష్ట్రాల్లో తగ్గుతున్నాయని వివరణ
  • మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టీకరణ

దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాలు తెలిపింది. గత 24 గంటల్లో 46 వేల కొత్త కేసులు వచ్చాయని వెల్లడించింది. దాదాపు 60 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయని తెలిపింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించింది. కేరళలో ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో సగం కేసులు కేరళలోనే ఉన్నాయని వెల్లడించింది.

ప్రస్తుతం దేశం కొవిడ్ సెకండ్ వేవ్ మధ్యలో ఉందని పేర్కొంది. రానున్నది పండుగల సీజన్ అని, సెప్టెంబరు, అక్టోబరు మాసాలు ఎంతో కీలకమని వివరించింది. కరోనా వ్యాక్సిన్ ల ద్వారా రక్షణ పొందవచ్చని, కానీ మాస్కులు విధిగా ధరించాలని స్పష్టం చేసింది.

కాగా, కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్రం వర్గాలు వెల్లడించాయి. జాతీయ సాంకేతిక సలహా బృందంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News