Manoj Bajpayee: బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కేపై పరువు నష్టం దావా వేసిన నటుడు మనోజ్ బాజ్ పాయ్

Actor Manoj Bajpayee files defamation suit on KRK
  • మనోజ్ నటించిన 'ఫ్యామిలీ మెన్' సిరీస్ పై కేఆర్కే విమర్శలు
  • మనోజ్ గంజాయి మత్తులో ఉంటాడని ఆరోపణ
  • ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా వేసిన మనోజ్
బాలీవుడ్ క్రిటిక్ కమాల్ రషాద్ ఖాన్ (కేఆర్కే) ఎప్పుడూ సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. తాజాగా నటుడు మనోజ్ బాజ్ పాయ్ ను టార్గెట్ చేశాడు. మనోజ్ నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ సాఫ్ట్ పోర్న్ సిరీస్ అని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సునీల్ పాల్ అనే ఒక నెటిజన్ స్పందిస్తూ... ఒక్క అడల్ట్ సీన్ ఉన్నందుకే సిరీస్ ను సాఫ్ట్ పోర్న్ గా పరిగణిస్తావా? అని ప్రశ్నించాడు. చాలా పెద్ద జోక్ చేశావంటూ ఎద్దేవా చేశాడు.

దీనికి కేఆర్కే సమాధానమిస్తూ... తాను చెత్త పనులు చేయనని... వెబ్ సిరీస్ లు చూడనని చెప్పాడు. అందువల్ల సునీల్ పాల్ వంటి వారిని కొన్ని విషయాలు అడగాలని.. ఎప్పుడూ గంజాయి మత్తులో ఉండే మనోజ్ ను సునీల్ ఎలా చూడగలుగుతారో అని అన్నారు. బాలీవుడ్ మత్తులో జోగుతోందని విమర్శించే వాళ్ల సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేఆర్కేపై మనోజ్ ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా వేశాడు. దీనిపై సెప్టెంబర్ 4న కోర్టులో విచారణ జరగనుంది.
Manoj Bajpayee
KRK
Bollywood
Defamation Suit

More Telugu News