Shashi Tharoor: తనపై వచ్చిన మీమ్స్ లో మూడింటిని మెచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

Congress MP Shashi Tharoor selects three of memes on him
  • ఇటీవల కేరళలో ఓనం పండుగ 
  • గుడిలో కొబ్బరికాయ కొట్టిన థరూర్
  • ఆ ఫొటోను పలు విధాలుగా మార్చిన నెటిజన్లు
  • నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్
ఇటీవల కేరళలో ఓనం పండుగ జరగ్గా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వీరావేశంతో కొబ్బరికాయ కొడుతున్న ఫొటో అందరినీ ఆకర్షించింది. అయితే, ఆ ఫొటో కంటే ఆయనపై వచ్చిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కొబ్బరికాయ కొడుతున్న పోజును వివిధ సందర్భాలకు అన్వయించి నెటిజన్లు రూపొందించిన ఆ మీమ్స్ అందరినీ అలరించాయి. ఎంపీ శశిథరూర్ కూడా తనపై వచ్చిన మీమ్స్ ను ఆస్వాదించారు. వాటిలో మూడు మీమ్స్ తనకు బాగా నచ్చాయని ఆయన పేర్కొన్నారు. వాటిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
Shashi Tharoor
Memes
Coconut Smashing
Onam
Kerala

More Telugu News