Sensex: ఈ వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు
- కొనుగోళ్ల మద్దతుతో నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు
- 176 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 68 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఉదయం ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 56,125కి చేరుకుంది. నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 16,705 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.64%), ఎల్ అండ్ టీ (2.66%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.17%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.58%), సన్ ఫార్మా (1.53%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.04%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.70%), నెస్లే ఇండియా (-0.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.42%).