Chandrababu: మా ఇద్దరిదీ నలభై ఏళ్ల సాహచర్యం: చంద్రబాబు

I have 40 years association with Jyothula Nehru says Chandrababu
  • హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతుల నెహ్రూ
  • ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు
  • ఇలాంటి పోరాటయోధులు పార్టీకి అవసరమని వ్యాఖ్య
టీడీపీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూని ఈరోజు చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తమ ఇద్దరిదీ నలభై సంవత్సరాల సాహచర్యమని ఆయన చెప్పారు. ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నేత నెహ్రూ అని కితాబునిచ్చారు. పోలవరం నిర్వాసితుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ, అందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. ఇలాంటి పోరాటయోధులు పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. నెహ్రూగారు త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు తిరిగి రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
Chandrababu
Jyothula Nehru
Telugudesam

More Telugu News