Vadde Sobhanadreeswara Rao: మోదీ ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలు.. దేశవ్యాప్త ఉద్యమం తప్పదు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
- ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- అల్లూరి వారసులుగా దీనిని అడ్డుకుంటాం
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను దునుమాడారు. కేంద్రం ఇష్టానుసారంగా తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. రైతు ఉద్యమం కొనసాగింపుపై జాతీయ కన్వెన్షన్ తీసుకున్న నిర్ణయాలను ఏపీలోనూ అమలు చేస్తామన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే చూస్తూ ఊరుకోబోమని, అల్లూరి సీతారామరాజు వారసులుగా తెలుగుజాతి సహించబోదని హెచ్చరించారు. ఏపీలో రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి దేశంలో చారిత్రాత్మక పోరాటం సాగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.