Afghanistan: ఆఫ్ఘనిస్థాన్​ పై వ్యూహాలు మారుస్తున్నాం: రక్షణ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​

Changing Strategies Accordingly the situation In Afghanistan

  • సమీకరణాలు మారుతున్నాయ్.. అవి భారత్ కు సవాలే
  • సమీకృత యుద్ధ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాం
  • వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో అవి కీలకం

ఆఫ్ఘనిస్థాన్ లో పరిణామాలు, సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయని, అది భారత్ కు పెను సవాలేనని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ పై భారత్ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే వ్యూహాలను మారుస్తున్నామని, క్వాడ్ కూడా దగ్గర్నుంచి గమనిస్తోందని అన్నారు.

న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ లో జరిగిన జాతీయ భద్రతల రక్షణ సంస్కరణలపై ఆయన మాట్లాడారు. సమీకృత యుద్ధ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిగణిస్తున్నామని చెప్పారు. యుద్ధ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే చాలా కీలకమని అన్నారు. ఈ గ్రూపులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. సమీకృత పోరాట యూనిట్ల ఏర్పాటుకు ఈ గ్రూపులు చర్యలు తీసుకుంటాయని చెప్పారు.

  • Loading...

More Telugu News