ISRO: ‘గగన్​ యాన్​’ తొలి పరీక్షలో ఇస్రో పాస్​

ISRO Successfully Conducts Hot Test Of Gaganyan Propulsion System

  • ప్రొపల్షన్ సిస్టమ్ హాట్ టెస్ట్ విజయవంతం
  • నిన్న తమిళనాడు సెంటర్ లో పరీక్ష
  • సిస్టమ్ డెమాన్ స్ట్రేషన్ మోడల్ పై టెస్ట్ చేసినట్టు ఇస్రో వెల్లడి

‘గగన్ యాన్’ తొలి పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దాటింది. నిన్న గగన్ యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ వ్యవస్థను ఇస్రో మండించింది. సిస్టమ్ డిమాన్ స్ట్రేషన్ మోడల్ (ఎస్డీఎం) హాట్ టెస్ట్ (వేడిని తట్టుకునే శక్తి/సామర్థ్యం) పరీక్షను చేసినట్టు వెల్లడించింది. 450 సెకన్ల పాటు హాట్ టెస్ట్ ను నిర్వహించామని, టెస్టును తమిళనాడులోని మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో చేశామని ప్రకటించింది.

టెస్టుల్లో భాగంగా అన్ని ప్రమాణాలను ఎస్డీఎం అందుకుందని తెలిపింది. ప్రయోగంలో భాగంగా ఎదురయ్యే వివిధ పరిస్థితులపై సిమ్యులేషన్ ద్వారా మరిన్ని హాట్ టెస్టులను నిర్వహిస్తామని పేర్కొంది. ప్రయోగంలో ఎస్డీఎం అత్యంత కీలకమని ఇస్రో తెలిపింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లే సిబ్బందిని పంపించేందుకు వాడే క్రూ మాడ్యూల్ కింద సర్వీస్ మాడ్యూల్ (ఎస్ఎం) అనుసంధానమై ఉంటుందని పేర్కొంది.


వ్యోమగాములు తిరిగి భూమి మీదకు వచ్చేంత వరకు అది క్రూ మాడ్యూల్ తోనే ఉంటుందని తెలిపింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ వ్యవస్థ నడిచేందుకు గానూ 440 న్యూట్ల సామర్థ్యం కలిగిన 5 థ్రస్ట్ ఇంజన్లను, 100 న్యూట్ల శక్తి కలిగిన 16 రియాక్షన్ నియంత్రణ వ్యవస్థ (ఆర్సీఎస్) థ్రస్టర్లు ఉంటాయిని చెప్పింది. వీటిలో ఆక్సిడైజర్ గా ఎంవోఎన్ 2, ఇంధనంగా ఎంఎంహెచ్ ను వాడుతారని తెలిపింది.

హాట్ టెస్ట్ లో భాగంగా 440 న్యూట్ల శక్తి కలిగిన 5  ఇంజన్లు, 100 న్యూట్ల శక్తి ఉన్న 8 థ్రస్టర్లు కలిగిన సిస్టమ్ డెమాన్ స్ట్రేషన్ మోడల్ (ఎస్డీఎం) తయారు చేశామని, పరీక్ష విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.

  • Loading...

More Telugu News