Afghanistan: కరుడుగట్టిన ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులకూ పాక్​ సహకారం!

Pak Supplying Arms and Explosives To IS Terrorists

  • కాబూల్ పేలుళ్లకు వాడిన ఆర్డీఎక్స్ అక్కడి నుంచే
  • ఆఫ్ఘన్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ నివేదిక
  • అధికారులు, ఉగ్రవాదుల నుంచి వివరాల సేకరణ

దాదాపు 200 మందిని బలి తీసుకున్న కాబూల్ పేలుళ్లతో పాకిస్థాన్ కు సంబంధాలున్నాయా? అత్యంత భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు తోడ్పాటునందిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అక్కడ జరిగిన పేలుళ్లలో వాడిన ఆర్డీఎక్స్ పాకిస్థాన్ నుంచే సరఫరా అయిందని ఆఫ్ఘనిస్థాన్ నిపుణులు చెబుతున్నారు.

పాక్ లోని పెషావర్, క్వెట్టా, నుంచే ఐసిస్ కేకి పేలుడు పదార్థాలు అందాయని కాబూల్ లోని ఆఫ్ఘన్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఏఐఎస్ఎస్) నివేదికలో పేర్కొంది. తలపాగాలు, కూరగాయల బండ్లలో పేలుడు పదార్థాలను పెట్టి సరిహద్దులను దాటించిందని, ఐసిస్ కు వాటిని అందించిందని వెల్లడించింది. పేలుడు పదార్థాలతో పాటు డబ్బును కూడా పంపిస్తున్నారని తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ఏఐఎస్ఎస్ ఈ సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ముఠాలోని 90 శాతం మంది పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన వారేనని పేర్కొంది. తమ ఆయుధాలన్నీ పాకిస్థాన్ నుంచే వస్తున్నట్టు ఐసిస్ ఉగ్రవాదులు చెప్పారని నివేదికలో వెల్లడించింది. ఐసిస్ ముఠాకు పాక్ అండగా నిలుస్తోందంటూ వారు చెప్పారని పేర్కొంది.

  • Loading...

More Telugu News