Chiranjeevi: నా పాత స్నేహితుడ్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi and Kapildev at Falaknuma Palalce
  • హైదరాబాదులో విందు కార్యక్రమం
  • ఫలక్ నుమా ప్యాలెస్ లో కలుసుకున్న చిరు, కపిల్
  • పాత స్మృతుల్లోకి వెళ్లిన చిరు
  • కపిల్ పై ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులోని చారిత్రక ఫలక్ నుమా ప్యాలెస్ లో ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ తో కలిసినప్పటి క్షణాలను చిరంజీవి తన అభిమానులతో పంచుకున్నారు. దీనిపై ఓ ట్వీట్ చేశారు.

"చాలాకాలం తర్వాత నా పాతమిత్రుడు కపిల్ దేవ్ తో అద్భుతమైన భేటీ జరిగింది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఫలక్ నుమా ప్యాలెస్ లో మేం కలుసుకోవడం మరింత ప్రత్యేకత చేకూర్చిపెట్టింది. ఒక్కసారి జ్ఞాపకాల్లోకి వెళ్లి వివిధ దశల్లో మా ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నాం. ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నాం. కపిల్ దేవ్ నిజంగానే హర్యానా హరికేన్. మనకు తొలి వరల్డ్ కప్ అందించిన యోధుడు" అని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి అర్ధాంగి సురేఖ కూడా పాల్గొన్నారు.
Chiranjeevi
Kapil Dev
Falaknuma Palace
Hyderabad
Tollywood
Cricket

More Telugu News