Corona Virus: అన్ని వేరియంట్లను తట్టుకునేలా ఒకే వ్యాక్సిన్ తయారు చేయాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య
- వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారీగానే కరోనా కేసులు
- రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తుండటమే కారణం
- వ్యాక్సిన్ తయారీకి అన్ని దేశాలు సహకరించాలన్న సౌమ్య
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాలో రకరకాల వేరియంట్లు పుట్టుకురావడంతో కేసుల కట్టడి అదుపులోకి రావడం లేదు. వ్యాక్సిన్లు అందిస్తున్నప్పటికీ... కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనాలో అన్ని వేరియంట్లను తట్టుకునేలా ఒకే వ్యాక్సిన్ ను తయారు చేయాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ అభివృద్ధికి అన్ని దేశాలు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే మహమ్మారుల నుంచి రక్షణ పొందాలంటే ఈ రకమైన వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు.