Taliban: అమెరికాకు చెందిన‌ చినూక్ హెలికాప్టర్లను స్వాధీనం చేసుకున్న‌ తాలిబన్లు.. వీడియో ఇదిగో

talibans take over usa helicopters

  • కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్  విమానాశ్రయంలో ఘ‌ట‌న
  • చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తాలిబ‌న్లు
  • ఇప్ప‌టికే ప‌లు ఆయుధాల స్వాధీనం

ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా సహా నాటో ద‌ళాలు వెనుదిర‌గ‌డంతో తాలిబ‌న్ల‌కు ఆయుధాలు చిక్క‌కుండా అగ్ర‌రాజ్యం త‌మ ఆయుధాలను కొన్నింటిని నాశ‌నం చేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ఆయుధాలు ఉగ్ర‌వాదుల‌కు చిక్కాయి. అమెరికా వదిలిపెట్టిన చినూక్ హెలికాప్టర్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.

కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కొన్ని గంట‌ల క్రితం తాలిబన్లు  విమానాశ్రయంలోని చినూక్ హెలికాప్టర్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

కాగా, ఎవ‌రూ ఊహించ‌నంత వేగంగా కొన్ని రోజుల క్రిత‌మే కాబూల్‌ను త‌మ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబ‌న్లు ఇప్ప‌టికే.. గ‌తంలో అమెరికా ఆఫ్ఘ‌న్‌కు అందించిన 6 లక్షల ఆయుధాలు, ఎం16 అస్సాల్ట్స్ రైఫిళ్లు, 1,62,000 కమ్యూనికేషన్ పరికరాలు, 16, 000 నైట్ విజన్ గాగుల్స్ ను స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తాలిబ‌న్లు ప‌లు సాయుధ వాహనాలతో పాటు స్కౌట్ అటాక్ హెలికాప్టర్లు, స్కాన్ ఈగల్ మిలటరీ డ్రోన్లు, 40 విమానాలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News