Vijayadasami: ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రుల షెడ్యూల్ విడుదల 

Vijayadasami Navaratri schedule
  • అక్టోబరు 15న విజయదశమి
  • అక్టోబరు 7న శరన్నవరాత్రుల ప్రారంభం
  • షెడ్యూల్ రూపొందించిన ఆలయ వర్గాలు
  • చివరిరోజున రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారి దర్శనం
అక్టోబరు 15న విజయదశమి పండుగను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించారు. అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు దసరా నవరాత్రులు నిర్వహించాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం, వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. తొలిరోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల ముగింపు రోజున శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో కనువిందు చేయనున్నారు.
Vijayadasami
Navaratrulu
Kanakadurga Temple
Schedule

More Telugu News