Anjan Kumar Yadav: అంజన్ కుమార్ యాదవ్ కు కరోనా... ఐసీయూలో చికిత్స

 Anjan Kumar Yadav tested corona positive
  • కరోనా లక్షణాలతో బాధపడుతున్న అంజన్
  • కరోనా టెస్టుల్లో పాజిటివ్
  • జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలింపు
  • పరామర్శించిన తలసాని
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్టులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజన్ కుమార్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

కాగా, కరోనాతో బాధపడుతున్న అంజన్ కుమార్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మూడుచింతపల్లిలో దీక్షా కార్యక్రమం నిర్వహించింది. ఆ దీక్షలో పాల్గొని వచ్చిన తర్వాత కొన్నిరోజులకే అంజన్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు.
Anjan Kumar Yadav
Corona Virus
Positive
Congress
Telangana

More Telugu News