Rahul Gandhi: మోదీ హయాంలో గ్యాస్ ధరలు 116 శాతం పెరిగాయి: రాహుల్ గాంధీ
- క్రూడాయిల్ ధర ప్రస్తుతం 74 డాలర్లుగా ఉంది
- అయినా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి
- పెట్రోల్, డీజిల్, గ్యాస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 23 లక్షల కోట్లను సంపాదించింది
కొన్ని నెలలుగా వంట గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఇప్పుడు మరోసారి సిలిండర్ పై రూ. 25 పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 2014 నుంచి మోదీ హయాంలో గ్యాస్ ధరలు 116 శాతం పెరిగాయని విమర్శించారు.
యూపీఏలో హయాంలో క్రూడాయిల్ ధర 110 డాలర్లుగా ఉండగా... ఇప్పుడు 74 డాలర్లే అని... అయినప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని రాహుల్ దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ. 23 లక్షల కోట్లను సంపాదించిందని... ఆ డబ్బును ఎటు మళ్లించారని ప్రశ్నించారు.