China: శ్రీలంకలో విస్తరిస్తున్న చైనా కార్యకలాపాలు.. భారత వర్గాలలో ఆందోళన!

China closer to India Dragon climate expanding in Sri Lanka

  • ద్వీపదేశం ఉత్తర ప్రాంతంలో చైనా కార్యకలాపాలు
  • భవిష్యత్తులో వ్యూహాత్మక స్థావరాలయ్యే అవకాశం
  • స్థానిక తమిళుల భావాలను పట్టించుకోని శ్రీలంక
  • భారత రక్షణ వ్యవస్థ ఆందోళన

మన పొరుగు దేశం శ్రీలంకలో చైనా కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీలంక ఉత్తర దిశలో భారత సరిహద్దుకు చేరువగా చైనా తన పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో భారత రక్షణ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఈ ప్రాంతాలను చైనా వ్యూహాత్మక మిలటరీ స్థావరాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ఇప్పటికే రుణ విధానాలతో శ్రీలంకలో అడుగు పెట్టిన చైనా.. నెమ్మదిగా అక్కడ తన ప్రాభవాన్ని పెంచుకుంటోంది. కొంతకాలం క్రితం వరకూ చైనా కార్యకలాపాలు శ్రీలంక దక్షిణ భాగానికే పరిమితం అయ్యాయి. కానీ శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రభుత్వం... శ్రీలంక ఉత్తర దిశలో కూడా చైనాకు పలు ప్రాజెక్టులు అప్పగించేందుకు రెడీ అయింది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న తమిళుల మనోభావాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వినికిడి.

ఫిబ్రవరి నెలలో జాఫ్నా ప్రాంతంలోని మూడు చిన్న దీవుల్లో 12 మిలియన్ డాలర్ల విలువైన పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టులను చైనాకు చెందిన సైనోసార్-ఎటెచ్విన్ కంపెనీకి కట్టబెట్టాలని శ్రీలంక నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భారత్ ఖండించింది. ఈ మూడు దీవులు తమిళనాడుకు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టులు పూర్తిచేయడం కోసం తాము 12 మిలియన్ డాలర్ల గ్రాంట్ అందిస్తామని లంక ప్రభుత్వానికి భారత్ ఆఫర్ ఇచ్చినప్పటికీ, శ్రీలంక ఖాతరు చేయలేదు.  

జపాన్‌తో కలిసి కొలంబో పోర్టులో ఈస్ట్ కంటైనర్ టర్మినల్‌ను అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకున్న శ్రీలంక.. ఈ ఒప్పందం నుంచి అర్థాంతరంగా తప్పుకోవడంపై భారత్ అసంతృప్తిగా ఉంది. అలాగే ట్రింకోమలిలో ఆయిల్ ట్యాంకుల ప్రాజెక్టు విషయంలో కూడా భారత్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా, చైనాకు శ్రీలంక ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుండటం పట్ల భారత రక్షణ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News