Sonia Gandhi: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్!

Dissent On Prashant Kishors Induction Sonia Gandhi To Decide Sources said
  • సోనియాతో చర్చించిన సీనియర్ నేతలు
  • పీకే రాకను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు
  • వస్తే మేలేనన్న మరికొందరు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ చేరికకు సంబంధించి పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే అధినేత్రి సోనియాగాంధీతో చర్చించారని, త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన చేరికను ఆహ్వానిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే మేలే జరుగుతుందని చెబుతున్నారు. పార్టీ వైఖరిని విమర్శిస్తూ గతంలో సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలు కూడా పీకే రాకను వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు. పీకేను పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అన్న విషయంలో త్వరలోనే సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Sonia Gandhi
Prashant Kishor
Congress

More Telugu News