Hollywood: ఉద్యోగులకు ఐటీ కంపెనీ బంపరాఫర్.. వెబ్ సిరీస్ చూసేందుకు సెలవు!

IT company offers leave to employees so they can watch web series

  • సాకులు చెప్పి సెలవులు పెట్టేస్తారని తెలుసంటూ సరదా ప్రకటన
  • జైపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీ నిర్ణయం
  • శుక్రవారం నాడు స్ట్రీమ్ కానున్న ‘మనీ హీస్ట్’ 5వ సీజన్

గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమా రిలీజైనప్పుడు ఎలాంటి వాతావరణం ఉందో గుర్తుందా? ఆ సినిమా రిలీజ్ రోజు దేశంలోని చాలా కంపెనీలు ఉద్యోగులకు సెలువులు కూడా ప్రకటించాయి. ఇదిగో మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇదేదో ఇండియన్ హీరో సినిమా కాదు. స్పానిష్ వెబ్ సిరీస్ ‘మనీ హీస్ట్’.

ఈ వెబ్ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ 5వ సీజన్ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఈ సిరీస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక ఐటీ కంపెనీ తన ఉద్యోగులను ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానున్న శుక్రవారం నాడు తమ ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చేసింది.

ఈ మేరకు వెర్వ్ లాజిక్ అనే కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. ఉద్యోగులంతా ఏవో కుంటి సాకులు చెప్పి సెలవులు పెట్టేస్తారని, కొంతమంది ఫోన్లు కూడా స్విచాఫ్ చేసేస్తారని తమకు తెలుసంటూ కంపెనీ సీఈవో అభిషేక్ జైన్ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే తానే ముందుగా అందరికీ సెలవు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

‘నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ హాలీడే’ కింద ఈ సెలవు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సరదా ప్రకటన నెట్‌ఫ్లిక్స్ సంస్థకు కూడా తెలిసింది. దీంతో అభిషేక్ నిర్ణయాన్ని అభినందించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News