Corona Virus: ప్ర‌మాద‌క‌ర సీ.1.2 క‌రోనా వేరియంట్‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పంద‌న‌

no c12 cases in india says govt

  • ప‌లు దేశాల‌కు వ్యాపించిన వైరస్
  • వ్యాక్సిన్లకూ లొంగ‌ని వేరియంట్
  • దేశంలో సీ.1.2 కేసులు న‌మోదు కాలేద‌న్న కేంద్రం

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు వ్యాక్సిన్ల‌ను వేస్తున్న‌ప్ప‌టికీ ఆ వైర‌స్ కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తూ క‌ల‌వ‌ర‌పెడుతోంది. వ్యాక్సిన్ల‌కు లొంగ‌ని విధంగా క‌రోనా వేరియంట్లు పుట్టుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు ముందుగా హెచ్చరిక‌లు చేసిన‌ట్లు ఇటీవ‌ల ప‌లు దేశాల్లో ప్ర‌మాద‌క‌ర సీ.1.2 వేరియంట్‌ను నిపుణులు గుర్తించారు.

దీనిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోన్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం స్పందించి ప‌లు వివ‌రాలు తెలిపింది. సీ.1.2కు సంబంధించి దేశంలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదని కేంద్ర స‌ర్కారు ప్ర‌క‌ట‌న చేసింది. కాగా, అతి వేగంగా వ్యాపించే ఈ వేరియంట్‌ను మే నెలలో తొలిసారి దక్షిణాఫ్రికాలో గుర్తించగా, ఇప్పుడు చైనా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా ఆరు దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పటి వరకు కనుగొన్న వేరియంట్లతో పోల్చి చూస్తే కనుక సీ.1.2 చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. వ్యాక్సిన్ల‌ ద్వారా కూడా దీని నుంచి మ‌నం కాపాడుకోలేక‌పోవ‌చ్చ‌ని హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News