Congress: దేశవ్యాప్త సమస్యలపై పోరాటాలకు కమిటీ నియమించిన కాంగ్రెస్... ఉత్తమ్ కు స్థానం
- ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ యుద్ధభేరి
- పోరాటాల కమిటీకి రూపకల్పన
- దిగ్విజయ్ నేతృత్వంలో కమిటీ
- ప్రియాంక తదితరులకు స్థానం
ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. దేశవ్యాప్తంగా సమస్యలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాల కోసం ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నాయకత్వం వహించనున్నారు. ఇందులో 9 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.
మనీశ్ ఛత్రాత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, జుబేర్ ఖాన్, డాక్టర్ రాగిణి నాయక్, ఉదిత్ రాజ్ ఈ కమిటీలో ఇతర సభ్యులు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ కమిటీలో రాహుల్ గాంధీకి చోటు దక్కలేదు.