Nara Lokesh: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వారు లేరని కేంద్రం విడుదల చేసిన ఈ నివేదిక స్పష్టం చేస్తోంది: లోకేశ్

lokesh slams ycp

  • గ‌తంలో చంద్ర‌బాబు గారు మెట్టు మెట్టు పేర్చుకుంటూ వ‌చ్చారు
  • మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడ్డారు
  • విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీని టాప్‌-5లో  నిలిపారు
  • ఇప్పుడు మనం 13వ స్థానంలో ఉన్నాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. 'ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారి ముఖం చూసి, మంత్రి మేక‌పాటి గౌతం గారి మాయ మాటలు విని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వారెవరూ లేరని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. చంద్ర‌బాబు నాయుడు గారు మెట్టు మెట్టు పేర్చుకుంటూ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీని మొదటి 5 స్థానాల్లో నిలుపుతూ వచ్చారు' అని లోకేశ్ అన్నారు.

'జగన్ రెడ్డి గారి దరిద్ర పాదానికి, అరాచకం తోడయ్యి, ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో, మనం 13వ స్థానంలో ఉన్నాం. మన పక్కన రాష్ట్రాలన్నీ, ఉన్నత స్థానంలోకి చేరుతుంటే... మన రాష్ట్రం దిగజారిపోతోంది' అని లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను పోస్ట్ చేశారు.    

              

  • Loading...

More Telugu News