Virat Kohli: ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ రికార్డు.. 15 కోట్ల ఫాలోవర్లను సాధించిన తొలి భారత క్రికెటర్

Kohli reaches 150 million followers in Instagram
  • ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సెలెబ్రిటీ కూడా
  • అంతర్జాతీయ క్రీడాకారుల్లో నాలుగో స్థానం
  • సోషల్ మీడియాలో అత్యంత పాప్యులర్
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాకపోతే ఇది మైదానంలో కాదు, మైదానం వెలుపల. ఆటలో చాలా ఎగ్రెసివ్‌గా కనిపించే కోహ్లీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన మధురానుభూతులన్నింటినీ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ వీడియో, ఫొటో షేరింగ్ వేదికలో 15 కోట్ల ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ కోహ్లీనే. ఈ క్రికెటర్ కాకుండా మరే ఇతర భారతీయ సెలెబ్రిటీ ఈ ఘనత సాధించలేదు. అయితే అంతర్జాతీయంగా చూసుకుంటే అత్యంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల్లో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

తొలి స్థానంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 కోట్లమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో లియోనెల్ మెస్సి (26 కోట్లు), నెయ్‌మార్ జూనియర్ (16 కోట్లు) నిలిచారు. వీరి తర్వాత ఈ జాబితాలో కోహ్లీ చేరాడు.
Virat Kohli
Instagram
Social Media

More Telugu News