Siddharth: బాలీవుడ్ సిద్ధార్థ్ మరణిస్తే దక్షిణాది సిద్ధార్థ్ కు నివాళులు అర్పించారు!

Netizens paid tributes to another Siddharth
  • బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి
  • సౌత్ హీరో సిద్ధార్థ్ ఫొటో పెట్టిన నెటిజన్లు
  • ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధార్థ్
  • ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని వ్యాఖ్య  
దక్షిణాది హీరో సిద్ధార్థ్ గతంలోనూ నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు. తాజాగా సోషల్ మీడియాలో చోటుచేసుకున్న పరిణామాలు సిద్ధార్థ్ ను తీవ్ర అసహనానికి గురిచేశాయి. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం చెందగా, నెటిజన్లలో కొందరు సౌత్ హీరో సిద్ధార్థ్ ఫొటో పెట్టి నివాళులు అర్పించారు. ఈ ఫొటోలు సిద్ధార్థ్ దృష్టికి వెళ్లాయి.

కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని, తనను వేధించడమే వారి లక్ష్యం అని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఎంతకి దిగజారిపోతున్నాం?' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రిప్ సిద్ధార్థ్ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన తన ఫొటోలను కూడా పంచుకున్నారు.
Siddharth
Siddharth Shukla
Tributes
Demise
Bollywood
South Cinema

More Telugu News