Taliban: ఆఫ్ఘనిస్థాన్ లో కీలక పరిణామం... పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు?

Taliban has takeover Panjshir as reports said
  • ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన ప్రారంభం
  • అదే సమయంలో పంజ్ షీర్ పై పంజా!
  • పారిపోయిన అమృల్లా సలేహ్
  • మీడియాలో కథనాలు
  • కథనాలను కొట్టిపారేసిన పంజ్ షీర్ యోధులు
ఇన్నాళ్లు కొరకరానికొయ్యలా పరిణమించిన పంజ్ షీర్ ప్రాంతాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ లో రాజధాని కాబూల్ సహా అత్యధిక భూభాగంపై పట్టు సాధించిన తాలిబన్లకు ఇన్నాళ్లు పంజ్ షీర్ సవాలుగా మారింది. అయితే, కొన్నిరోజులుగా అత్యధిక సంఖ్యలో బలగాలను తరలించిన తాలిబన్లు పంజ్ షీర్ ను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారని పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఫోరం వెల్లడించింది.

ఆఫ్ఘనిస్థాన్ కు ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ పంజ్ షీర్ నుంచి తజకిస్థాన్ కు పారిపోయాడని, అతడి వెంట కొందరు పంజ్ షీర్ కమాండర్లు కూడా ఉన్నారని పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఫోరం తెలిపింది. అయితే, తాము తాలిబన్లకు లొంగిపోయామన్న వార్తలను పంజ్ షీర్ యోధులు కొట్టిపారేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలని, తాలిబన్లు ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.
Taliban
Panjshir
Amrulla Saleh
Afghanistan

More Telugu News