CORBEVAX: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్... కోర్బెవాక్స్ ట్రయల్స్ కు అనుమతులు ఇచ్చిన డీసీజీఐ
- ఐదేళ్ల నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్
- అభివృద్ధి చేసిన బయోలాజికల్-ఇ
- తదుపరి రెండు దశలకు డీసీజీఐ అనుమతి
- త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం
హైదరాబాద్ నగరం కరోనా వ్యాక్సిన్ హబ్ గా అవతరిస్తోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ తయారుచేసి అంతర్జాతీయ చిత్రపటంలో హైదరాబాదుకు మరింత వన్నె తెచ్చింది. తాజాగా నగరానికి చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరిట కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ కు తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.
కోర్బెవాక్స్ పూర్తిగా దేశీయ వ్యాక్సిన్. దీన్ని 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసుల వారికి వేసేలా రూపొందించారు. దీనికి తదుపరి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. మరికొన్ని నెలల్లోనే కోర్బెవాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.