Karthikeya: ఆసక్తిని రేపుతున్న 'రాజా విక్రమార్క' టీజర్!

Raja Vikramarka teaser released
  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'రాజా విక్రమార్క'
  • కార్తికేయ జోడీగా తాన్య హోప్
  • కీలక పాత్రలో సాయికుమార్
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన  
కార్తికేయ కథానాయకుడిగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందుతోంది. '88' రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా తాన్యహోప్ అలరించనుంది.

వరుణ్ తేజ్ చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయించారు. టీజర్ అంతా కూడా తనికెళ్ల భరణి - కార్తికేయ పాత్రలపై కట్ చేశారు. కంటెంట్ కి తగినట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది.

కార్తికేయ పాత్రకి యాక్షన్ తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. కీలకమైన పాత్రలో సాయికుమార్ కనిపిస్తున్నాడు.  
Karthikeya
Tanya Hope
Sai Kumar

More Telugu News